Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో పారిశ్రామికాభివృద్ధికి కొత్త అధ్యాయం: గడ్డా ఫక్రుద్దీన్

04-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కడప, జులై 4: రాయలసీమ ప్రజల దశాబ్దాల కలగా భావించిన జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని సున్నపురాళ్లపల్లిలో హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించడం ద్వారా రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి నూతన దిశ నిర్దేశించారని పేర్కొన్నారు.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ద్వారా దశలవారీగా 2 ఎంఎటీపీఏ సామర్థ్యంతో రూ.16,350 కోట్ల పెట్టుబడి, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ద్వారా 3,850 మెగావాట్ల సౌర–పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.20,350 కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఊతమిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, రాయలసీమ యువత ఉద్యోగ కలలకు ఇవి చిరునామాగా నిలుస్తాయని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని గడ్డా ఫక్రుద్దీన్ విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమకు చెప్పుకోదగ్గ పారిశ్రామిక ప్రాజెక్టులు తీసుకురాలేకపోయిన వారు ఇప్పుడు అభివృద్ధిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతుంటే, ప్రతిపక్షం రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నట్లు గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.

Sthanikam

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో పారిశ్రామికాభివృద్ధికి కొత్త అధ్యాయం: గడ్డా ఫక్రుద్దీన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News