Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:21 PM

జులై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం. మాదిగ అమరవీరుల ఆత్మగౌరవ స్థూపం నిర్మించాలి: జిల్లా వెంకటేష్ మాదిగ

04-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర నడిబొడ్డున మాదిగ అమరవీరుల ఆత్మగౌరవ స్థూపాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు.

32 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం చేస్తోందని, ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను సమాజం ఎన్నటికీ మరవదన్నారు. మాదిగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం మాదిగ అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే మూడు ఎకరాల్లో మాదిగ అమరవీరుల స్మృతి వనం, ఆత్మగౌరవ స్థూపం నిర్మించాలని, దండోరా ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల తరహాలో దండోరా ఉద్యమకారులకు గుర్తింపు కల్పించి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు.

Sthanikam

జులై 7న ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం. మాదిగ అమరవీరుల ఆత్మగౌరవ స్థూపం నిర్మించాలి: జిల్లా వెంకటేష్ మాదిగ

Article Image

ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర నడిబొడ్డున మాదిగ అమరవీరుల ఆత్మగౌరవ స్థూపాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మాదిగ దండోరా ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు.

32 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం చేస్తోందని, ఆ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను సమాజం ఎన్నటికీ మరవదన్నారు. మాదిగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం మాదిగ అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే మూడు ఎకరాల్లో మాదిగ అమరవీరుల స్మృతి వనం, ఆత్మగౌరవ స్థూపం నిర్మించాలని, దండోరా ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ఉద్యమకారుల తరహాలో దండోరా ఉద్యమకారులకు గుర్తింపు కల్పించి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.

జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా వెంకటేష్ మాదిగ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News