Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

టీఆర్ఎస్ పేరుకు బ్రేక్.. కవిత పార్టీకి ఎన్నికల సంఘం షాక్

04-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

15 రోజుల్లో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని ఆదేశం.. లేకపోతే దరఖాస్తు మూసివేత హెచ్చరిక.

హైదరాబాద్, జూలై 4:

ఎమ్మెల్సీ కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పేరుకు సంబంధించి ప్రజల నుంచి పలు అభ్యంతరాలు అందిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపాదించిన "టీఆర్ఎస్" పేరును ఆమోదించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.ఈ మేరకు కవితకు ఎన్నికల సంఘం లేఖ రాసి, 15 రోజుల లోపు మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సూచించాలని ఆదేశించింది. నిర్ణీత గడువులో కొత్త పేర్లను సమర్పించకపోతే ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండా పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది.గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన నేపథ్యంలో, అదే సంక్షిప్త నామంతో మరో పార్టీ నమోదు చేయాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం ప్రజల్లో గందరగోళం తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

దీంతో కవిత కొత్త పార్టీకి కొత్త పేరు ఖరారు చేసే ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల సంఘం తాజా ఆదేశాల నేపథ్యంలో పార్టీ భవిష్యత్ వ్యూహంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

టీఆర్ఎస్ పేరుకు బ్రేక్.. కవిత పార్టీకి ఎన్నికల సంఘం షాక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News