Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:34 AM

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి

04-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి, : గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుతో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ప్రస్తుతం మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం ఈ నెల 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్ఠానం సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

ఒక ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడికి లేదా బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేతకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Sthanikam

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న రెండు స్థానాల భర్తీపై దృష్టి

Article Image

అమరావతి, : గవర్నర్ కోటాలో ఈ నెలాఖరుతో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ప్రస్తుతం మండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం ఈ నెల 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధిష్ఠానం సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

ఒక ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడికి లేదా బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేతకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే, అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టీడీపీ అధిష్ఠానం తుది నిర్ణయం అనంతరం అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News