Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:49 AM

ఏరియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ. శిథిల భవనంపై స్థానికుల వినతి.. స్పందించిన డిప్యూటీ కలెక్టర్

04-07-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అభా' యాప్‌లోనే హాజరు నమోదు చేయాలి

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, హాజరు రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఇకపై తప్పనిసరిగా 'అభా' (ABHA) డిజిటల్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

అనంతరం జనరల్ వార్డులు, ఓపీ విభాగాన్ని సందర్శించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వర్షాలకు పైకప్పు నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతున్నాయని స్థానికులు, రోగులు డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రోగులు, వైద్య సిబ్బంది ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నారని, వెంటనే కొత్త ఆస్పత్రి భవనం మంజూరు చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ కృతిక.. భవన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తనిఖీలో వైద్యులు అలివేలు, శ్వేత ప్రియాంక, స్వాతిబాయి, నవీన్ సింగ్, మాధవాచారి, సపోర్టింగ్ ఇంజనీర్ శోభనతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఏరియా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ. శిథిల భవనంపై స్థానికుల వినతి.. స్పందించిన డిప్యూటీ కలెక్టర్

Article Image

అభా' యాప్‌లోనే హాజరు నమోదు చేయాలి

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, హాజరు రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఇకపై తప్పనిసరిగా 'అభా' (ABHA) డిజిటల్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

అనంతరం జనరల్ వార్డులు, ఓపీ విభాగాన్ని సందర్శించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆస్పత్రి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వర్షాలకు పైకప్పు నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతున్నాయని స్థానికులు, రోగులు డిప్యూటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రోగులు, వైద్య సిబ్బంది ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నారని, వెంటనే కొత్త ఆస్పత్రి భవనం మంజూరు చేయాలని కోరారు.

దీనిపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ కృతిక.. భవన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తనిఖీలో వైద్యులు అలివేలు, శ్వేత ప్రియాంక, స్వాతిబాయి, నవీన్ సింగ్, మాధవాచారి, సపోర్టింగ్ ఇంజనీర్ శోభనతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News