Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..! హయత్‌నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

05-07-2026 148 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కమిషన్ ఎదుటే ఫోన్‌పే ద్వారా వసూలు

హయత్ నగర్

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన సమాచారాన్ని గడువులోగా అందించకపోవడంతో హయత్‌నగర్ మండల విద్యాధికారి (ఎంఈవో) కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.5 వేల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని కమిషన్ ఎదుటే ఫోన్‌పే ద్వారా చెల్లింపజేయడం చర్చనీయాంశమైంది.

హయత్‌నగర్ మండలానికి చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్‌బాబు చొల్లేటి కొంతకాలం క్రితం ఎంఈవో కార్యాలయం నుంచి కొన్ని వివరాలను కోరుతూ దరఖాస్తు చేశారు. అయితే చట్టంలో నిర్దేశించిన గడువు ముగిసినా సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు.

శనివారం జరిగిన విచారణలో ఎంఈవో సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కమిషనర్ దేశాల భూపాల్ నిర్ధారించారు. దీంతో ఆర్టీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5 వేల జరిమానా విధించారు.

జరిమానా మొత్తాన్ని అక్కడికక్కడే డిజిటల్ చెల్లింపు యాప్ 'ఫోన్‌పే' ద్వారా ప్రభుత్వ ఖాతాలో జమ చేయించాలని ఆదేశించగా, ఎంఈవో వెంటనే చెల్లించారు. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేసే అధికారులపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

Sthanikam

ఆర్టీఐని పట్టించుకోకపోతే ఇదే ఫలితం..! హయత్‌నగర్ ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News