Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

యూరియా బుకింగ్‌పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం.

05-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: రైతులకు యూరియా పంపిణీని నియంత్రితంగా, అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. పై అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర యాప్‌లో కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.

కొత్త విధానం ప్రకారం రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు అవసరమైన యూరియాను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. రెండు నుంచి ఐదు ఎకరాల వరకు సాగు ఉన్న రైతులకు రెండు విడతల్లో, ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు ఉన్న వారికి 40 శాతం, 30 శాతం, 30 శాతం చొప్పున మూడు విడతల్లో యూరియా బుకింగ్ అవకాశం కల్పించారు.

అంతేకాకుండా, రెండు వరుస యూరియా బుకింగ్‌ల మధ్య తప్పనిసరిగా 20 రోజుల వ్యవధి ఉండేలా నిబంధన విధించారు. కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర యాప్‌లో ఇప్పటికే అమల్లోకి రావడంతో రైతులకు అవగాహన కల్పించి, వాటి ప్రకారమే బుకింగ్‌లు చేపట్టాలని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

2 ఎకరాల వరకు – ఒకేసారి పూర్తి యూరియా బుకింగ్

2–5 ఎకరాలు – రెండు విడతల్లో బుకింగ్.

5 ఎకరాల పైన – 40:30:30 నిష్పత్తిలో మూడు విడతలు

రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం తప్పనిసరి

Sthanikam

యూరియా బుకింగ్‌పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం.

Article Image

హైదరాబాద్,: రైతులకు యూరియా పంపిణీని నియంత్రితంగా, అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. పై అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర యాప్‌లో కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.

కొత్త విధానం ప్రకారం రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు అవసరమైన యూరియాను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. రెండు నుంచి ఐదు ఎకరాల వరకు సాగు ఉన్న రైతులకు రెండు విడతల్లో, ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు ఉన్న వారికి 40 శాతం, 30 శాతం, 30 శాతం చొప్పున మూడు విడతల్లో యూరియా బుకింగ్ అవకాశం కల్పించారు.

అంతేకాకుండా, రెండు వరుస యూరియా బుకింగ్‌ల మధ్య తప్పనిసరిగా 20 రోజుల వ్యవధి ఉండేలా నిబంధన విధించారు. కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర యాప్‌లో ఇప్పటికే అమల్లోకి రావడంతో రైతులకు అవగాహన కల్పించి, వాటి ప్రకారమే బుకింగ్‌లు చేపట్టాలని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

2 ఎకరాల వరకు – ఒకేసారి పూర్తి యూరియా బుకింగ్

2–5 ఎకరాలు – రెండు విడతల్లో బుకింగ్.

5 ఎకరాల పైన – 40:30:30 నిష్పత్తిలో మూడు విడతలు

రెండు బుకింగ్‌ల మధ్య 20 రోజుల విరామం తప్పనిసరి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News