Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

06-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత ప్రతిభకు పదును పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మై భారత్’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని కెరీర్, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహనతో పాటు జాతీయ స్థాయి అవకాశాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.పదో తరగతి ఉత్తీర్ణులైన యువత వాలంటీర్లుగా నమోదు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చన్నారు. పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మమేకమయ్యే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.హైదరాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్ గౌండ్, రామ, విశ్వకర్మ రాజు, వైష్ణవ్, ప్రణీత్ తదితరులు ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ‘వికసిత్ భారత్–వైబ్రెంట్ బార్డర్ విలేజ్’ ఆన్‌లైన్ క్విజ్‌లో విజేతలుగా నిలిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం పొందారు.హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 55 వేల మందికి పైగా యువత ‘మై భారత్’లో నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మరింత మంది యువతను చేర్చేందుకు జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శశాంక్ రావుల మాట్లాడుతూ, అర్హులైన యువత అందరూ ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Sthanikam

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News