Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

04-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కృష్ణా,

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను కృష్ణాజిల్లాలోని కానూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన ఏడుకొండలు నాయకత్వం వహించారు. జయంతి సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ఆయనకు విశేష అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణించి 38 సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. నేటి యువత వంగవీటి మోహనరంగాను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుప్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు.. *పరిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ

Article Image

కృష్ణా,

మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలను కృష్ణాజిల్లాలోని కానూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన ఏడుకొండలు నాయకత్వం వహించారు. జయంతి సందర్భంగా పరిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి చీరలను పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదల ఆశాజ్యోతి అని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా ఆయనకు విశేష అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణించి 38 సంవత్సరాలు గడిచినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని తెలిపారు. నేటి యువత వంగవీటి మోహనరంగాను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతన సత్యనారాయణ, తుమ్మల నాంచారయ్య, పుప్పాల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News