Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:28 PM

వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి

09-07-2026 449 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గోవధకు సంబంధించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. జాతీయ రహదారి-65పై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోవులను వధ చేసి, వాటి కళేబాలను ఎవరికి అనుమానం రాకుండా సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

స్థానిక యువకులకు అనుమానం రావడంతో అక్కడ ఉన్న సిమెంట్ రింగులను పగులగొట్టి పరిశీలించగా కళేబాలు బయటపడినట్లు సమాచారం. దీంతో విషయం గ్రామంలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు. అలాగే కళేబాలను రహస్యంగా దాచిపెట్టడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెలిమినేడు శివారులో గోవధ కలకలం.. సిమెంట్ రింగుల్లో కళేబాలు వెలుగులోకి

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గోవధకు సంబంధించిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. జాతీయ రహదారి-65పై ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో గోవులను వధ చేసి, వాటి కళేబాలను ఎవరికి అనుమానం రాకుండా సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

స్థానిక యువకులకు అనుమానం రావడంతో అక్కడ ఉన్న సిమెంట్ రింగులను పగులగొట్టి పరిశీలించగా కళేబాలు బయటపడినట్లు సమాచారం. దీంతో విషయం గ్రామంలో వేగంగా వ్యాపించి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఈ ఘటన వెనుక ఉన్న నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు. అలాగే కళేబాలను రహస్యంగా దాచిపెట్టడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News