Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

డిగ్రీ చదువుకు అడుగుపెట్టిన సినీ నటుడు రాహుల్ రామకృష్ణ

09-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ కోర్సులో చేరిక.. పుస్తకాలు అందజేసిన వీసీ ఘంటా చక్రపాణి

హైదరాబాద్, జూలై 9: ‘భరత్ అనే నేను’ సినిమా ఫేం సినీ నటుడు రాహుల్ రామకృష్ణ డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో చేరారు. గురువారం విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయన అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణిను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి రాహుల్ రామకృష్ణకు అభినందనలు తెలియజేసి బీఏ కోర్సుకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. అనంతరం మాట్లాడిన రాహుల్ రామకృష్ణ, ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయిన వారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో నిలిపివేసిన వారు, గృహిణులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక వరమని పేర్కొన్నారు.

ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా విద్య మనిషికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని ఆయన అన్నారు. తాను ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు తిరిగి విద్యాభ్యాసం కొనసాగించేందుకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో చేరినట్లు తెలిపారు.ఇటీవలి కాలంలో వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి తీసుకుంటున్న నిర్ణయాలు తనను ఆకట్టుకున్నాయని, ఆదివాసీ తెగలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత విద్యను అందిస్తూ సమాన అవకాశాలు కల్పించడం అభినందనీయమని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు.

విద్యకు వయస్సుతో సంబంధం లేదని, జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ కొనసాగాలని ఆయన సందేశం ఇచ్చారు.

Sthanikam

డిగ్రీ చదువుకు అడుగుపెట్టిన సినీ నటుడు రాహుల్ రామకృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News