Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

బడుగు మోహన్ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం

08-07-2026 216 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* చేనేత కార్మికులను కలిసి ఓటు వేయాలని కోరిన వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్

* చేనేత సంఘం అభివృద్ధికి పారదర్శక పాలన అవసరం

చేనేత సహకార సంఘం ఎన్నికల వేడి పెరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడుగు మోహన్ ప్యానెల్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన వివిధ కాలనీలు, వీధుల్లో పర్యటించి చేనేత కార్మికులను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. చేనేత సహకార సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, పారదర్శక పాలనే ధ్యేయంగా బడుగు మోహన్ ప్యానెల్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయాలంటే సేవా భావం కలిగిన నాయకత్వం అవసరమని, అందుకు బడుగు మోహన్ నాయకత్వమే సరైనదని ఆయన పేర్కొన్నారు.​ఈ ఎన్నికల్లో బడుగు మోహన్ ప్యానెల్ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బడుగు మోహన్ పోటీ చేస్తుండగా.. డైరెక్టర్లుగా కాటబత్తిని భీమయ్య, గోశిక నరసింహ, గోశిక లక్ష్మీపతి, గోశిక శ్రీకాంత్, దోర్నాల లక్ష్మీనారాయణ, పాపని రామకృష్ణ తమ ప్యానెల్ మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడటానికి తమ ప్యానెల్ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. సభ్యులంతా ఐక్యంగా ముందుకు వచ్చి తమ ప్యానెల్ అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.​ఈ ప్రచార కార్యక్రమంలో ప్యానెల్ అభ్యర్థులు, చేనేత సహకార సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

బడుగు మోహన్ ప్యానెల్ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News