Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:11 PM

సంస్థాన్‌ నారాయణపురం ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ

06-07-2026 398 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చట్టం ముందు అందరూ సమానమే

ఫిర్యాదులపై సత్వర న్యాయం అందిస్తాం

అందుబాటులో ఉంటూ ప్రజా పోలీసింగ్‌కు ప్రాధాన్యం

సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా సీత పాండు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో బాధ్యతల రికార్డులపై సంతకం చేశారు. ​అనంతరం ఎస్‌ఐ సీత పాండు మీడియాతో మాట్లాడుతూ... చట్టం ముందు అందరూ సమానమేనని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా పారదర్శకంగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, స్థానిక ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మండల ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా 'ప్రజా పోలీసింగ్‌' విధానానికి ప్రాధాన్యం ఇస్తాం.మండల పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగినా సహించేది లేదని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన సీత పాండును పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

సంస్థాన్‌ నారాయణపురం ఎస్‌ఐగా సీత పాండు బాధ్యతల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News