Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:17 AM

శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు స్ఫూర్తిదాయకం

06-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేటలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగరాజు రుక్మారావు, ఉపాధ్యాయ విభాగం రాష్ట్ర సహ సమన్వయకర్త తీకుళ్ల సాయిరెడ్డి, రాష్ట్ర నాయకులు బూర మల్సూర్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రివర్గంలో పరిశ్రమలు, సరఫరాల శాఖ మంత్రిగా సేవలందించారని తెలిపారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడిగా దేశంలో జాతీయవాద భావజాలానికి బలమైన పునాది వేసిన నాయకుడని కొనియాడారు.

జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ దేశ సమగ్రత కోసం ఆయన నిరంతరం పోరాటం చేశారని, ఆ ఉద్యమంలో భాగంగా నిర్బంధంలోనే ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను రద్దు చేయడం ద్వారా ఆయన సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు.

అత్యంత చిన్న వయస్సులో విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఉన్నత విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని, నేటి సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధిలో ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్లమళ్ల నర్సింహా, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు పరుశరామ్, రవివర్మ, దాసరి వెంకన్న యాదవ్, కోడి లింగయ్య, తన్నీరు వాసుదేవ్, రామచందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు స్ఫూర్తిదాయకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News