Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం

06-07-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బైకులపై పడిన విద్యుత్ తీగలు.. తృటిలో తప్పిన ప్రమాదం

అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆందోళన.

చిట్యాల,

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఖుషి వైన్స్ ముందు విద్యుత్ వైర్లు తెగిపడి బైకులపై పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటన సమయంలో బైకులను అక్కడ పార్క్ చేసి యజమానులు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్డులో అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలపై పడటంతో కొంతసేపు భయాందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో ఎవరూ వాహనాల వద్ద లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లేదంటే తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.

విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి తెగిపోయిన వైర్లను తొలగించి, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే సంబంధిత శాఖలు అప్రమత్తమై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Sthanikam

ఖుషి వైన్స్ ఎదుట కరెంటు వైర్లు తెగిపడి కలకలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News