Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:17 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇంటింటి ప్రచారం

06-07-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 17వ వార్డులో భారత రాష్ట్ర సమితి నాయకులు సోమవారం ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు.

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూచనల మేరకు పార్టీ నాయకుడు కీసర వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను ధృవీకరించుకుని జాబితాలో పేరు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కీసర వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ప్రజలు చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. వార్డులో ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకుడు నరేడ్ల మల్లయ్య నాయుడు, స్థానిక నాయకులు ఆదిమళ్ల వేణు, మొగిలి మధు, వావిలాల ప్రభాకర్, బిట్టు శివ, వడ్డేపల్లి మహేష్, బొజ్జ నవీన్, మొగిలి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇంటింటి ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News