Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

బాలికల హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత:జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి

08-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఝరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే నివాస పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె. లలిత కుమారి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం, మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, అత్యవసర సహాయ సేవలు, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆడపిల్లల విద్య ప్రాముఖ్యత, మహిళల భద్రత, సాధికారత వంటి అంశాలపై విద్యార్థినులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ప్రతి బాలిక తన హక్కులు తెలుసుకుని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి అధికారులు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, వైద్యాధికారి, మహిళా సహాయ కేంద్రం ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమీకృత శిశు అభివృద్ధి సేవల పర్యవేక్షకులు, పోలీసు శాఖ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలికల హక్కులు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత:జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి

Article Image

జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఝరాసంగం మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే నివాస పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె. లలిత కుమారి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం, మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు, అత్యవసర సహాయ సేవలు, సామాజిక మాధ్యమాల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆడపిల్లల విద్య ప్రాముఖ్యత, మహిళల భద్రత, సాధికారత వంటి అంశాలపై విద్యార్థినులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ప్రతి బాలిక తన హక్కులు తెలుసుకుని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి అధికారులు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, వైద్యాధికారి, మహిళా సహాయ కేంద్రం ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమీకృత శిశు అభివృద్ధి సేవల పర్యవేక్షకులు, పోలీసు శాఖ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News