Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 PM

జులై 14 జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలి: తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్

08-07-2026 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ జులై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న జిల్లాస్థాయి ధర్నాను ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం 2023 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ (PRC)ని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే జనవరి 2024 నుంచి ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జులై 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జులై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేష్, రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు భీమ్లా నాయక్, జిల్లా బాధ్యులు శివరంజని, యాదగిరి, సుజాత, భాగ్యమ్మ, మండల అధ్యక్షులు రావుల శివకుమార్, దత్తాత్రేయ, రాజేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జులై 14 జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేయాలి: తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News