Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:56 PM

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

08-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్‌ఐఆర్ అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను సందర్శించారు. అక్కడి వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన రోజువారీ వ్యాపారం, ఆదాయం, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరుపై కూడా వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, లాడే మల్లేశం, మసూద్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

అందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్‌ఐఆర్ అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి శివారులో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను సందర్శించారు. అక్కడి వ్యాపారులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన రోజువారీ వ్యాపారం, ఆదాయం, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల సమస్యలు, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరుపై కూడా వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, లాడే మల్లేశం, మసూద్, శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News