Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:34 PM

పోలీసుల భూమికి హైడ్రా కవచం. కొత్తపేటలో అక్రమ కట్టడాలపై బుల్డోజర్ల దూకుడు

09-07-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

700 గజాల్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం

అక్రమ కట్టడాల కూల్చివేత.. ఫెన్సింగ్‌తో భద్రత

పోలీసు శాఖకు చెందిన రూ.14 కోట్ల భూమి స్వాధీనం.

పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై హైడ్రా బుధవారం ఉక్కుపాదం మోపింది. కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సుమారు 700 గజాల విస్తీర్ణంలో రూ.14 కోట్ల విలువైన పోలీసు శాఖ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని, ఆక్రమణలు పునరావృతం కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

హైడ్రా అధికారుల వివరాల ప్రకారం, ఉప్పల్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామ సర్వే నంబర్–135లోని ఈ స్థలాన్ని 2007లో చైతన్యపురి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ అధికారికంగా కేటాయించింది. అప్పట్లో పోలీస్ శాఖ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు స్థలానికి ఫెన్సింగ్ కూడా నిర్మించారు.

అయితే కాలక్రమేణా కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాల ఆధారంగా భూమిని ఆక్రమించి గుడిసెలు, తాత్కాలిక షెడ్లు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు గుర్తించారు. దీనిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణ అనంతరం భూమి ప్రభుత్వానిదేనని నిర్ధారణ కావడంతో కూల్చివేత చర్యలకు శ్రీకారం చుట్టారు.

భారీ పోలీసు బందోబస్తుతో బుధవారం ఉదయం హైడ్రా, రెవెన్యూ, పోలీసు శాఖ సంయుక్త బృందాలు జేసీబీలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాయి. అనంతరం స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని మళ్లీ ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

కూల్చివేతల సందర్భంగా కొందరు ఆక్రమణదారులు అధికారులతో వాగ్వాదానికి దిగినా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ కూల్చివేతలను హైడ్రా ఏసీపీ ఉమా మహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్ నరసింహ, తహసీల్దార్ హేమమాలిని, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు తదితరులు పర్యవేక్షించారు.

ప్రభుత్వ భూములపై కన్నేస్తే చర్యలే

ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

Sthanikam

పోలీసుల భూమికి హైడ్రా కవచం. కొత్తపేటలో అక్రమ కట్టడాలపై బుల్డోజర్ల దూకుడు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News