Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది

10-06-2026 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* నూతన పాలకవర్గ ప్రోత్సాహం అభినందనీయం

* పీపల్ పహాడ్‌లో ఘనంగా ‘బడిబాట’.. గడప గడపకూ తిరిగిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు

ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతి విద్యార్థి బాధ్యత తమదేనని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామంలో బుధవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు.​గ్రామంలో క్రమం తప్పకుండా రోజూ బడిబాట కార్యక్రమం నిర్వహించటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ముప్పై సంవత్సరాలుగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఈ స్థాయిలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు గడప గడపకూ తిరగడం తామెన్నడూ చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నూతన ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ పెద్దలు కూడా తోడై ఇల్లేల్లూ తిరగడం ఈ బడిబాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులనాగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, బద్దం సుధాకర్ రెడ్డి, ఎర్ర పూజా పరమేష్, పాఠశాల ఉపాధ్యాయులు ఉమాదేవి, శ్రీదేవి, సురేష్, అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మి, కారోబార్ దానయ్య, గ్రామ పెద్దలు రోషణగారి మల్లయ్య, చీర్క రంగారెడ్డి, బకనగారి బుచ్చయ్య, ఎర్ర యాదయ్య, కామిశెట్టి అభిలాష్, కావ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థుల బాధ్యత మాది

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News