Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:34 PM

గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. డీజీపీ, ఎస్పీకి డీవైఎఫ్‌ఐ వినతి

10-06-2026 207 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల,

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ నాయకులు రాష్ట్ర డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లకు వినతిపత్రం అందజేశారు.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి విచ్చేసిన డీజీపీ, ఎస్పీలను డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు కలిసి గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా, కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, బ్యాంకింగ్ మోసాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచడం సమాజం మొత్తం బాధ్యత అని మల్లం మహేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు పంది నరేష్, నాయకులు ఆడెపు రమేష్, గోలి సాయికిరణ్, కూరాకుల బాలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలి. డీజీపీ, ఎస్పీకి డీవైఎఫ్‌ఐ వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News