Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

వేగం కాదు.. భద్రతే ముఖ్యం: ప్రజలకు డీజీపీ

10-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా పోలీసు శాఖ అధికారులు, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ వి.వి. శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రజలు రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

“తొందర తొందరగా ప్రయాణాలు చేయడం మానుకోవాలి. రహదారులపై ప్రయాణించే సమయంలో నెమ్మదిగా, ఆచితూచి వెళ్లాలి. సమయం మించిపోతుందనే ఆత్రంతో మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దు” అని హెచ్చరించారు.

ఒక కుటుంబంలో సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన మాటల్లో చెప్పలేమని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వేగం కాదు.. భద్రతే ముఖ్యం: ప్రజలకు డీజీపీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News