Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

మోదీ దీర్ఘాయుష్షు కోసం యాదాద్రిలో ప్రత్యేక పూజలు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతల అర్చనలు

10-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: నాయకులు

యాదాద్రి,

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీకాలంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ నాయకత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు యాదాద్రి కొండపైకి చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ శతాయుష్షుతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు వేముల అశోక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వరుసగా 12 సంవత్సరాలు దేశానికి నాయకత్వం వహించడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశం పురోగతి దిశగా సాగుతోందని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, ఏలే చంద్రశేఖర్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్, మండల అధ్యక్షుడు గుంటిపల్లి మహేశ్వరి సత్యం, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మోదీ దీర్ఘాయుష్షు కోసం యాదాద్రిలో ప్రత్యేక పూజలు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతల అర్చనలు

Article Image

తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: నాయకులు

యాదాద్రి,

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీకాలంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ నాయకత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు యాదాద్రి కొండపైకి చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీ శతాయుష్షుతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు వేముల అశోక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వరుసగా 12 సంవత్సరాలు దేశానికి నాయకత్వం వహించడం విశేషమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశం పురోగతి దిశగా సాగుతోందని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, ఏలే చంద్రశేఖర్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్, మండల అధ్యక్షుడు గుంటిపల్లి మహేశ్వరి సత్యం, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News