Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

"ఉర్దూ మీడియం పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.. మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది" – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

10-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క ప్రాంతంలో రూ.44 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని, అవసరమైతే రూ.కోటి వరకు ఖర్చు చేసి అత్యుత్తమ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉర్దూను రెండో భాషగా గుర్తించడంతో పాటు సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు అవకాశాలు పెంచడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఏఐ విద్యపై ప్రత్యేక దృష్టి

ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణ అందిస్తున్నామని, ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బొట్టుగూడ పాఠశాల తరహాలోనే ఉర్దూ మీడియం పాఠశాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

షాదీఖానాకు రూ.10 కోట్లు

ముస్లిం మైనార్టీల కోసం రూ.10 కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అవసరమైతే స్థలం కల్పించి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sthanikam

"ఉర్దూ మీడియం పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం.. మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది" – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Article Image

నల్గొండ,

ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క ప్రాంతంలో రూ.44 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని, అవసరమైతే రూ.కోటి వరకు ఖర్చు చేసి అత్యుత్తమ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉర్దూను రెండో భాషగా గుర్తించడంతో పాటు సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు అవకాశాలు పెంచడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఏఐ విద్యపై ప్రత్యేక దృష్టి

ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణ అందిస్తున్నామని, ముస్లిం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బొట్టుగూడ పాఠశాల తరహాలోనే ఉర్దూ మీడియం పాఠశాలను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

షాదీఖానాకు రూ.10 కోట్లు

ముస్లిం మైనార్టీల కోసం రూ.10 కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అవసరమైతే స్థలం కల్పించి ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉర్దూ మీడియం పాఠశాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News