Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:41 AM

మహిళలకు, చిన్నారులకు భద్రతా మరియు నేరాలపై అవగాహన కల్పిస్తున్న శక్తి టీం..

10-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మహిళలు, చిన్నారుల భద్రత మరియు నేరాల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, చిన్నారులకు మహిళల భద్రత, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు మరియు జాగ్రత్తలపై వివరించారు. అలాగే చిన్నారులపై జరిగే నేరాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు, పోక్సో (POCSO) చట్టం, మిస్సింగ్ కేసులు, చైన్ స్నాచింగ్ ఘటనలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే పోలీసులను సంప్రదించేందుకు డయల్-100/112, మహిళల సహాయ కేంద్రం-181, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్-1930, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 నంబర్ల వినియోగంపై వివరించారు.

అలాగే మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన శక్తి యాప్ ప్రాముఖ్యతను తెలియజేసి, కార్యక్రమానికి హాజరైన మహిళలతో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.

ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని శక్తి టీమ్ సభ్యులు సూచించారు.

Sthanikam

మహిళలకు, చిన్నారులకు భద్రతా మరియు నేరాలపై అవగాహన కల్పిస్తున్న శక్తి టీం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News