Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి

10-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

– చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కడతాల యాదగిరి పిలుపు

– జనసమీకరణపై ‘టి.ఆర్.పి’ కీలక సమావేశం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న నిర్వహించ తలపెట్టిన ‘రాజ్యాధికార సమరభేరి’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ చౌటుప్పల్ మండల అధ్యక్షుడు కడతాల యాదగిరి పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, జనసమీకరణ కార్యాచరణపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ​ఈ సందర్భంగా కడతాల యాదగిరి మాట్లాడుతూ.. రాజ్యాధికార సాధనకై ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో గల ప్రతి కుల సంఘం అధ్యక్షులకు, కుల పెద్దలకు జూలై 5 సభ ఆహ్వాన పత్రికలను నేరుగా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమరభేరి సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.​ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యా గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసయ్య, చౌటుప్పల్ జనరల్ సెక్రటరీ అరూరి శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News