Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

10-06-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామసభ బుధవారం ఘనంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.​ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మున్సిపాలిటీలో పాలన సాగుతోందని, పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.99 రోజుల ప్రణాళికతో వార్డుల రూపురేఖలు మార్చుతాం..​అనంతరం వార్డు కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. గత 99 రోజుల ప్రణాళికలో భాగంగా వార్డులో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. వార్డులో ఇంకా మిగిలి ఉన్న సమస్యలన్నింటినీ స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యేక నిధుల ద్వారా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఆమె పిలుపునిచ్చారు.ఈ గ్రామసభలో స్థానిక ప్రజలు తమ వార్డులోని డ్రైనేజీ, సిసి రోడ్లు, తాగునీరు, వీధి దీపాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సందగళ్ల విజయ సతీష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, స్థానిక ఎస్సై, విద్యుత్ శాఖ ఏఈ సతీష్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ పట్టణాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News