Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:34 PM

ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు

07-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

త్వరలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం: రియా మౌర్య

హైదరాబాద్, జూలై 6

ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని రియా మౌర్య పిలుపునిచ్చారు. నగరంలోని దోమలగూడలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య అవగాహన సదస్సులో ఆమె పాల్గొని స్థానికులకు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు.

దోమలగూడ ప్రాంతంలో మురికి కాలువలు, దోమల సమస్య అధికంగా ఉందని పేర్కొన్న ఆమె, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని రియా మౌర్య సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు.

Sthanikam

ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజల్లో చైతన్యం పెరగాలి. రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు

Article Image

త్వరలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం: రియా మౌర్య

హైదరాబాద్, జూలై 6

ప్రజలు ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని రియా మౌర్య పిలుపునిచ్చారు. నగరంలోని దోమలగూడలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక ఆరోగ్య అవగాహన సదస్సులో ఆమె పాల్గొని స్థానికులకు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు.

దోమలగూడ ప్రాంతంలో మురికి కాలువలు, దోమల సమస్య అధికంగా ఉందని పేర్కొన్న ఆమె, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని రియా మౌర్య సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు త్వరలో రిషారియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News