Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:30 PM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు గడువు ఎస్టీలకు ఉచిత ప్రవేశాలు.. స్టడీ సెంటర్‌లోనే సైన్స్ ప్రాక్టికల్స్

07-07-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ విద్యార్థులకు సైన్స్ ప్రాక్టికల్స్‌ను భువనగిరి స్టడీ సెంటర్‌లోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన డిగ్రీ విద్యను అభ్యసించే అవకాశం ఓపెన్ యూనివర్సిటీ కల్పిస్తోందన్నారు. ఉద్యోగులు, గృహిణులు, మధ్యలో చదువు మానేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ (గిరిజన) విద్యార్థులకు ఉచిత డిగ్రీ ప్రవేశ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇతర విశ్వవిద్యాలయాల డిగ్రీలతో సమానమైన గుర్తింపు కలిగి ఉందన్నారు.

అలాగే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు కూడా ఆగస్టు 7వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు స్టడీ సెంటర్ జాయింట్ కో-ఆర్డినేటర్ బొజ్జ బాలయ్యను సెల్ నంబర్ 90005 90545లో సంప్రదించాలని సూచించారు.

Sthanikam

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు గడువు ఎస్టీలకు ఉచిత ప్రవేశాలు.. స్టడీ సెంటర్‌లోనే సైన్స్ ప్రాక్టికల్స్

Article Image

భువనగిరి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ గంజి రమేష్ తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ విద్యార్థులకు సైన్స్ ప్రాక్టికల్స్‌ను భువనగిరి స్టడీ సెంటర్‌లోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన డిగ్రీ విద్యను అభ్యసించే అవకాశం ఓపెన్ యూనివర్సిటీ కల్పిస్తోందన్నారు. ఉద్యోగులు, గృహిణులు, మధ్యలో చదువు మానేసిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ (గిరిజన) విద్యార్థులకు ఉచిత డిగ్రీ ప్రవేశ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇతర విశ్వవిద్యాలయాల డిగ్రీలతో సమానమైన గుర్తింపు కలిగి ఉందన్నారు.

అలాగే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు కూడా ఆగస్టు 7వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు స్టడీ సెంటర్ జాయింట్ కో-ఆర్డినేటర్ బొజ్జ బాలయ్యను సెల్ నంబర్ 90005 90545లో సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News