Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:19 AM

ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

07-07-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ

ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూర్యాపేట 25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ సూచించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో వాసన్ లేజర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే తీవ్రమైన ఇబ్బందులను నివారించవచ్చని చెప్పారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఇటువంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మోర శబరి, సాయి, శివరాజు, బోయిన సాయి, కోడి రాజేష్, నాగరాజు, వెన్నెల, రమణ, గౌతమ్, వెంకన్న, వాసన్ లేజర్ కంటి ఆసుపత్రి సిబ్బంది జనార్ధన చారి, సీహెచ్ శంకర్, నిస్సి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News