Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

నారాయణఖేడ్ యువతకు బంగారు భవిష్యత్తు.. జుక్కల్‌లో జూలై 09వ తారీకు ఏటీసీ కేంద్రానికి శ్రీకారం

Updated : 07 Jul 2026 17:09 IST
As Preferred Source 1 min read
నారాయణఖేడ్ యువతకు బంగారు భవిష్యత్తు.. జుక్కల్‌లో జూలై 09వ తారీకు ఏటీసీ కేంద్రానికి శ్రీకారం

నారాయణఖేడ్ మండలంలోని జుక్కల్ శివారులో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి స్థలాన్ని, నిర్మాణ ప్రణాళికలను పరిశీలించి పనులు నాణ్యతతో, వేగంగా చేపట్టాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి, సంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధికి, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ, శంకుస్థాపన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news