Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి – ఎమ్మెల్యే ,జిల్లా సంక్షేమ అధికారి

07-07-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో బాల సమాధానం కేంద్రంలో జిల్లా మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 'మిషన్ శక్తి – బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మహిళలు కేవలం గృహ బాధ్యతలకే పరిమితం కాకుండా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మహిళల భద్రత, విద్య, సాధికారత కోసం అమలు చేస్తున్న మిషన్ శక్తి, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రతి బాలిక విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మహిళల సంక్షేమం, భద్రత, ఉపాధి కల్పనకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, మున్సిపల్ కౌన్సిలర్,బి. రాజు, మహేష్ చౌహన్,రమేష్ చౌహన్, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి – ఎమ్మెల్యే ,జిల్లా సంక్షేమ అధికారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News