Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:18 AM

కన్నెపల్లి పంప్‌హౌస్ వెంటనే ప్రారంభించాలి

07-07-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కలెక్టరేట్ ముట్టడించిన బీఆర్ఎస్, రైతులు

సూర్యాపేట,కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి ఎండిపోతున్న ఆయకట్టును కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ను బీఆర్ఎస్ నాయకులు, రైతులు ముట్టడించారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాలను సకాలంలో విడుదల చేసి రైతులకు సాగునీరు అందించామని, ప్రస్తుతం రాజకీయ కక్షతోనే కన్నెపల్లి పంప్‌హౌస్ పునరుద్ధరణను ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే పంప్‌హౌస్‌ను ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ ముట్టడితో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి జలాలు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Sthanikam

కన్నెపల్లి పంప్‌హౌస్ వెంటనే ప్రారంభించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News