Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:16 AM

చేనేత సహకార సంఘం బలోపేతమే లక్ష్యం

చేనేత సహకార సంఘం బలోపేతమే లక్ష్యం

చేనేత సహకార సంఘం బలోపేతమే లక్ష్యం
07-07-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గండూరి రమేష్

చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్యులందరినీ కలుపుకొని కృషి చేస్తానని సంఘ నూతన అధ్యక్షుడు గండూరి రమేష్ తెలిపారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో డైరెక్టర్ల సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గండూరి రమేష్, ఉపాధ్యక్షుడిగా చిలివేరు నరసింహారావు, కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముషం హరిప్రసాద్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షేక్ బాజీ ప్రకటించారు.

అనంతరం నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గండూరి రమేష్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన సభ్యులు, డైరెక్టర్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్లు ముషం యాదమ్మ, విడం నీరజ, పెద్ది శ్రీనివాస్, యాలగందుల లక్ష్మయ్య, యాలగందుల సాయినేతతో పాటు సంఘ నాయకులు కడారి బిక్షం, బాల్నే మల్లయ్య, యాలగందుల సుదర్శన్, దూలం నగేష్, ఎస్. రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత సహకార సంఘం బలోపేతమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News