Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:35 AM

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

07-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినం, ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో మంగళవారం ఎమ్మార్పీఎస్ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్ మాదిగ మణికంఠ, గాంధీనగర్ టీడీపీ నాయకుడు చిన్న, తెలుగు యువత నాయకుడు జి. భవానీ శంకర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు జైభీమ్ విజయ్, మార్కెట్ యార్డు డైరెక్టర్ జయరాం, జనసేన మండల నాయకుడు పులి రాజు, జైభీమ్ యూత్ ప్రధాన కార్యదర్శి గరిజ నాగరాజు తదితరులు పాల్గొని మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ సాధన, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమం మరింత బలోపేతమై సామాజిక సమానత్వ సాధనలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమం అనంతరం ఎమ్మార్పీఎస్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News