Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:08 PM

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ
07-07-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.​రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్న ఆయన.. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్పొరేట్ దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్‌టాప్‌లను వెంటనే పంపిణీ చేయాలన్నారు. విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్. మండల ఉపాధ్యక్షులు దోనూరి శ్రావణ్ తిరిగి వరుణ్, మండల నాయకులు పోలేపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 10న విద్యాసంస్థల బంద్‌: ఎస్‌ఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News