Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:06 PM

ప్రతిభకు యువశక్తి ప్రోత్సాహం.. విద్యార్థినికి రూ.5 వేల నగదు బహుమతి

12-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో యువశక్తి యువజన సంఘం మరోసారి తన మాట నిలబెట్టుకుంది. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపింది.

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన ధరణికోట దినేష్ కుమార్తె ధరణికోట జయశ్రీ (న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్) పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించింది. గత ఏడాది ప్రకటించిన హామీ మేరకు యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు చింతపల్లి ప్రవీణ్ రూ.5 వేల నగదు బహుమతిని జయశ్రీకి అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో సంఘం తరఫున ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్య, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచే యువతను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో యువశక్తి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మద్ది మధు, కోశాధికారి బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు పరమేశ్, నిమ్మనగోటి శ్రీనివాస్, ఆవుల మహేష్, ఐలపురం నరేష్, గూడ అఖిల్, సిలివేరు రిశ్వంత్, మైల నుకేశ్, బొడ్డుపల్లి ప్రసాద్, శ్రీశాంత్, తిరుపాల గణేష్, రాంచరణ్, ఎస్కే ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభకు యువశక్తి ప్రోత్సాహం.. విద్యార్థినికి రూ.5 వేల నగదు బహుమతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News