Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:58 PM

గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు

11-07-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మైసూరు: భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు.

దాదాపు ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 20 భాషల్లో సుమారు 48 వేల పాటలు ఆలపించి అరుదైన రికార్డు సృష్టించారు. తన స్వర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆమెను అభిమానులు ప్రేమగా "గానకోకిల"గా పిలుచుకునేవారు.

జానకి మరణ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, భారత సంగీత రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు.

జానకి మరణంతో భారతీయ సంగీత ప్రపంచం ఓ గొప్ప గాన మాణిక్యాన్ని కోల్పోయిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

గానకోకిల మూగబోయింది.. భారత సంగీత లోకానికి తీరని లోటు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News