Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

నియోజకవర్గం, 100 పడకల ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి హామీ. కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సాధన సమితి

12-07-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించడంపై రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ప్రజల దశాబ్దాల డిమాండ్‌కు మంత్రి సానుకూలంగా స్పందించడం శుభపరిణామమని సమితి నాయకులు పేర్కొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటనతో రామన్నపేట ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనలో రామన్నపేటకు స్థానం కల్పించేందుకు, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు మంత్రి ఇచ్చిన హామీ ప్రజల ఆకాంక్షలకు బలాన్ని చేకూర్చిందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధుల సేవలను కొనియాడారు.

కృతజ్ఞతలు తెలిపిన వారిలో సాధన సమితి గౌరవ అధ్యక్షుడు రెబ్బస్ రాములు, అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్, కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, పెండం రవీందర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రామన్నపేట ప్రజల చిరకాల ఆకాంక్షలను ప్రభుత్వం త్వరలోనే కార్యరూపంలోకి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Sthanikam

నియోజకవర్గం, 100 పడకల ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి హామీ. కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ సాధన సమితి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News