Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:04 PM

గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

11-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నారాయణఖేడ్‌లోని తన నివాసంలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ (సీఐఎఫ్) పథకం కింద బాచేపల్లి గ్రామానికి చెందిన సాఫీజా బేగం, శ్రీరామ్ విజయ్‌లకు మేకల పెంపకం యూనిట్ల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ఆదాయ వనరులను పెంచుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్,ఏపీఎం వంశీకృష్ణ ,మోహన్‌రెడ్డి, బసవరాజ్, నగేష్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నారాయణఖేడ్‌లోని తన నివాసంలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ (సీఐఎఫ్) పథకం కింద బాచేపల్లి గ్రామానికి చెందిన సాఫీజా బేగం, శ్రీరామ్ విజయ్‌లకు మేకల పెంపకం యూనిట్ల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ఆదాయ వనరులను పెంచుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్,ఏపీఎం వంశీకృష్ణ ,మోహన్‌రెడ్డి, బసవరాజ్, నగేష్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News