Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్

11-07-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;రాష్ట్రంలో రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డిని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.తుంగతుర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.రైతు భరోసా పథకం కింద తక్కువ సమయంలోనే వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తోందన్నారు.వర్షపాతం, శాస్త్రవేత్తల సూచనలను అనుసరించి రైతులు పంటల సాగు చేయాలని సూచించారు.నూతనకల్ మండలంలోని సీలింగ్ భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో భూముల సర్వే, పట్టాల పంపిణీ ప్రక్రియ వేగవంతమైందని, వేలాది మంది రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు ఆర్థిక సహాయం వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని వివరించారు.తుంగతుర్తి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, విద్యాసంస్థలు, మినీ స్టేడియం, ఇండస్ట్రియల్ పార్క్, రహదారులు తదితర అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రకటించిన 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించారు. అర్హతలు లేని వారిని మండల అధ్యక్షులుగా ఎంపిక చేశారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన నిబంధనలు, అర్హతలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే మండల అధ్యక్షుల నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.కొంతమంది కావాలనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు లభిస్తుందని, పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు, కార్యకర్త గౌరవించాలని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని 9 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News