Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

అర్ధరాత్రి మంటలు.. రోడ్డుపై కూలిన భారీ వేపచెట్టు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో ట్రాఫిక్‌కు వెంటనే విముక్తి

11-07-2026 482 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరంలో భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వేపచెట్టుకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే చెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోవడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం జేసీబీ సాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన వేపచెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సమయానికి అధికారులు, సర్పంచ్ స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కొంతసేపు భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి.

Sthanikam

అర్ధరాత్రి మంటలు.. రోడ్డుపై కూలిన భారీ వేపచెట్టు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చొరవతో ట్రాఫిక్‌కు వెంటనే విముక్తి

Article Image

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాలనగరంలో భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వేపచెట్టుకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. కొద్దిసేపటికే చెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోవడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.

సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం జేసీబీ సాయంతో రోడ్డుపై అడ్డంగా పడిన వేపచెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సమయానికి అధికారులు, సర్పంచ్ స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కొంతసేపు భువనగిరి–చిట్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News