Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి

11-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

నల్లమాడ గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా 133, 134, 135 పోలింగ్ బూత్‌లను సందర్శించి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు ఎలా జరుగుతోందో అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు అయ్యేలా పూర్తి పారదర్శకతతో పని చేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మంజు రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జ్ చంద్ర రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మణికుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

సర్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి

Article Image

నల్లమాడ గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని తహశీల్దార్ మనోజ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా 133, 134, 135 పోలింగ్ బూత్‌లను సందర్శించి, బీఎల్‌వోలు నిర్వహిస్తున్న ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు ఎలా జరుగుతోందో అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతి అర్హుడైన ఓటరు వివరాలు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు అయ్యేలా పూర్తి పారదర్శకతతో పని చేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని బీఎల్‌వోలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మంజు రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జ్ చంద్ర రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మణికుమారితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News