Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉల్లిగడ్డల శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

11-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉల్లిగడ్డల శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎంకే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా జర్నలిస్టులు, సంఘ సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తానన్నారు. జిల్లాలోని ప్రతి జర్నలిస్టుకు సంఘం అండగా నిలిచేలా కార్యాచరణ రూపొందించి, సభ్యుల సంక్షేమం, వృత్తి గౌరవం, హక్కుల సాధనతో పాటు జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక పట్ల జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో సంఘం మరింత బలోపేతమై జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా ఉల్లిగడ్డల శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉల్లిగడ్డల శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎంకే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా జర్నలిస్టులు, సంఘ సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తానన్నారు. జిల్లాలోని ప్రతి జర్నలిస్టుకు సంఘం అండగా నిలిచేలా కార్యాచరణ రూపొందించి, సభ్యుల సంక్షేమం, వృత్తి గౌరవం, హక్కుల సాధనతో పాటు జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక పట్ల జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో సంఘం మరింత బలోపేతమై జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News