Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:59 PM

'ఎస్‌ఐఆర్' ప్రక్రియను నెల రోజులు పొడిగించాలి: సీపీఐ డిమాండ్

11-07-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఓటర్లను చైతన్యం చేయడంలో యంత్రాంగం విఫలం

​బీజేపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు కుట్ర ఆపాలి

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా నిర్వహిస్తున్న 'ఎస్‌ఐఆర్' ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఓటర్లను చైతన్యం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు చాలా మందికి ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారాలు ఎలా నింపాలో అవగాహన లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఫారాలు పంపిణీ చేయకుండా, ఓటర్లనే తమ వద్దకు రావాలని చెప్పడం సరికాదన్నారు.గ్రామ స్థాయిలో వెంటనే గ్రామ సభలు నిర్వహించి, ఓటర్లకు సరైన అవగాహన కల్పించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలే తప్ప, అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రగా మారకూడదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల గుర్తింపు ఆలస్యమవుతున్నందున.. గడువును మరో నెల రోజులు పొడిగించి, అర్హులైన ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.​ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్, మున్సిపాలిటీ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, నాయకులు ఉడత రామలింగం, కొండూరి వెంకటేష్, దాసరి అంజయ్య, టంగుటూరు రాములు, రోషణగారి అంజయ్య, రొండి నర్సింహా, బద్దుల సుధాకర్, నీళ్ల బిక్షపతి, కాకి పాండు, కుంటి పాపయ్య, దాసరి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

'ఎస్‌ఐఆర్' ప్రక్రియను నెల రోజులు పొడిగించాలి: సీపీఐ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News