Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత
11-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పదో తరగతి ఫలితాల్లో టాపర్లుగా యశస్విని, హర్షవర్ధిని, హర్షిత

ఇంటర్ ‘ఎంపీసీ’లో స్టేట్ ర్యాంక్ సాధించిన పూర్వ విద్యార్థిని వి. అక్షిత

ప్రతిభావంతులకు నగదు బహుమతులు అందజేసిన యాజమాన్యం

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 'ది ఐరా' గ్లోబల్ హైస్కూల్ విద్యార్థులు విద్యా సంవత్సరం (2025-2026) ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పాఠశాల కీర్తిని చాటారు. పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన టాపర్లను, అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ ర్యాంక్ సాధించిన పూర్వ విద్యార్థినిని పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. ​పదో తరగతి టాపర్లలో సి.హెచ్. యశస్విని 600 మార్కులకు గానూ 549 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, ఎస్. హర్షవర్ధిని 534 మార్కులతో ద్వితీయ స్థానంలో, బి. హర్షిత 499 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.​పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని వి. అక్షిత ఇంటర్మీడియట్ (ఎంపీసీ) ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గానూ 468 మార్కులు సాధించి అద్భుతమైన 'స్టేట్ ర్యాంక్' కైవసం చేసుకుంది. పాఠశాల చైర్మన్ అరుణ, కరస్పాండెంట్ శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొని టాపర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News