Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు

03-06-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించినప్పటికీ అన్ని శాఖలకు ప్రత్యేక అధికారులను నియమించకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదోని రెండో మండలానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, అన్ని శాఖల అధికారుల నియామకం, నూతన కార్యాలయాల ఏర్పాటు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండు మండలాలకు ఒకే తహసీల్దారు, పలుశాఖలకు ఒక్కో అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

రైతులు, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పార్థసారధి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. త్వరలోనే అధికారుల నియామకాలు, కార్యాలయాల ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకానికి చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News