Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:22 AM

మానవత్వం చాటిన ఆరెగూడెం సర్పంచ్.. బాలరాజ్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

03-06-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన శ్యాంసుందర్ అధిక వడ్డీ అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ మృతి చెందిన వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) బాలరాజ్ కుటుంబానికి ఆరెగూడెం సర్పంచ్ శ్యాంసుందర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకుని, వారి అవసరాల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.

బాలరాజ్ మరణంతో ఆయన భార్య, కుమార్తె, కుమారుడు ఆధారాన్ని కోల్పోయి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పిల్లల విద్యాభ్యాసం, కుటుంబ పోషణ వంటి బాధ్యతలు భారంగా మారిన నేపథ్యంలో సమాజంలోని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ విజ్ఞప్తికి స్పందించిన ఆరెగూడెం సర్పంచ్ శ్యాంసుందర్ వెంటనే రూ.10 వేల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన సేవాభావాన్ని అభినందించారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని, మరికొందరు కూడా తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.

బాలరాజ్ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. సర్పంచ్ శ్యాంసుందర్ చేసిన ఈ సహాయం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

మానవత్వం చాటిన ఆరెగూడెం సర్పంచ్.. బాలరాజ్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News