Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

రొద్దం : కూలీల సమస్యలపై సచివాలయం ముందు ఆందోళన

03-06-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కలిపి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ నాయకత్వం వహించారు. ఉపాధి పనులకు వెళ్లే కూలీలకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు, అవసరమైన మందులు, గడ్డపారు, గంపలు వంటి పనిముట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న కనీస వేతనం సరిపోవడం లేదని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో రోజువారీ వేతనాన్ని రూ.350 నుంచి రూ.600లకు పెంచాలని కోరారు.

ఈ సందర్భంగా కూలీల సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తికి అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓ. నరసప్ప, ప్రమీలమ్మ, గంగమ్మ, సిద్ధప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

రొద్దం : కూలీల సమస్యలపై సచివాలయం ముందు ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News